: కుమారులతో పాటు వచ్చి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసిన ఏపీ మంత్రి ప‌రిటాల సునీత


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి ప‌రిటాల సునీత ఈ రోజు క‌లిశారు. ఆమెతో పాటు ఆమె కుమారులు శ్రీరామ్, సిద్ధార్థ్ కూడా ఉన్నారు. పెద్దబ్బాయి శ్రీరామ్ వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆమె ఆహ్వానించారు. పరిటాల శ్రీరామ్‌ వివాహం వచ్చేనెల 1వ తేదీన జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన జ్ఞానవితో శ్రీరామ్ నిశ్చితార్థం గతనెల 10న జరిగింది. పెళ్లి కూతురు జ్ఞానవి.. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంకు చెందిన ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె. 

  • Loading...

More Telugu News