: కంచ ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలి.. ఆ పుస్తకాన్ని నిషేధించాలి: మంత్రి మాణిక్యాల రావు
‘సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐలయ్య తీరుపై ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాల రావు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కంచ ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక కులాన్ని కించపరచే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఐలయ్య రాసిన ఆ పుస్తకాన్ని నిషేధించాలని తాను కోరుతున్నానని వ్యాఖ్యానించారు. కాగా, ఏపీలో సదావర్తి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.