: జాతీయ రహదారిపై కంచ ఐలయ్య దిష్టి బొమ్మ దహనం... భారీగా ట్రాఫిక్ జామ్!
'సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు' అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యుల సంఘం మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కంచ ఐలయ్య ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా కుల-మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్గేలా చేస్తున్నారని వారు అన్నారు. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తరువాత జాతీయ రహదారపై ఐలయ్య దిష్టి బొమ్మ దహనం చేసి, రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.