: కేసీఆర్ గారు, మీరు తీసుకున్న నిర్ణయం సంతోషకరం: వెంకయ్యనాయుడు


తెలుగు భాషకు పునర్వైభవం తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ తెలుగు భాష బోధనను తప్పనిసరి చేయాలంటా ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మాతృ భాషకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా త్వరలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News