: టిక్కెట్లు ఇవ్వాలంటే విన్యాసాలు చేయాల్సిందే... వైరల్ అవుతున్న హర్యానా కండక్టర్ వీడియో!
బస్సులో ప్రయాణికులు అధికంగా ఉన్నపుడు బస్సును ఓ పక్కకు ఆపి కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో బస్సు ఆపినందుకు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఈ సమస్యకు హర్యానాలోని ఓ కండక్టర్ పరిష్కారం చూపించాడు. కండక్టర్ వృత్తి నిర్వహణలో భాగంగా కొన్ని సార్లు విన్యాసాలు కూడా చేయాల్సి వస్తుందని అతను నిరూపించాడు.
అందులో భాగంగా ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సులో టికెట్లు ఇవ్వడానికి కండక్టర్ ఒక సీటు మీద నుంచి మరో సీటు మీదకి దూకుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కండక్టర్ ఇలా చేయడానికి ప్రయాణికులు కూడా ఎలాంటి అభ్యంతరం తెలియజేయడం లేదట. ఏదేమైనా బస్సు మాత్రం ఆగకూడదని వారు ఇలా సీట్ల మీద నుంచి గెంతడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కండక్టర్ ఇలా దాటుతున్నపుడు బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే జరిగే ప్రమాదం గురించి వీరెవ్వరూ ఆలోచించకపోవడం హాస్యాస్పదం!