: ఒకే స్కూల్లో చదివారంతే... ఏం సంబంధముందో తెలియదు: చాందినీ జైన్ తల్లి


తన కుమార్తె చాందినీ జైన్, సాయికిరణ్ లు సిల్వర్ ఓక్స్ స్కూల్లో ఒకేసారి విద్యను అభ్యసించారని, ఆపై చాందిని అక్కడే ఇంటర్ చదువుతుండగా, సాయికిరణ్ ఎక్కడ చదువుతున్నాడో తమకు తెలియదని, వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో కూడా తమకు తెలియదని, కానీ తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిపోయిందని రెండు రోజుల క్రితం హత్యకు గురికాబడిన చాందిని తల్లి వాపోయారు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె, సాయికిరణ్ ఓ ప్లేబాయ్ వంటి వాడు కావచ్చని, ఆరు నెలలకోసారి అమ్మాయిలను మార్చేవాడని, తన కూతురిపై ఆకర్షణ పెంచుకుని, ఓ పథకం ప్రకారం హత్య చేశాడని ఆరోపించారు. ఇంట్లో ఇతర స్నేహితుల గురించి చెప్పేట్లుగానే సాయి గురించీ చెబుతుండేదే తప్ప, అతన్ని ప్రేమిస్తున్నట్టు ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అతను మంచివాడని అనుకున్నామని, ఇంత పని చేస్తాడని ఊహించలేదని విలపించారు. అతనొక్కడే తమ కుమార్తెను హత్య చేశాడంటే నమ్మటం లేదని, మరింత మంది దీని వెనకాల ఉండవచ్చని, వారిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News