: ప్లాస్మాతో కేన్స‌ర్‌కి చికిత్స‌... సాధ్య‌మే అంటున్న శాస్త్ర‌వేత్త‌లు


అనిశ్చిత స్థితిలో ఉండే ప‌దార్థ‌పు నాలుగో స్థితి ప్లాస్మా దిశ‌, వేగాన్ని నియంత్రించి కేన్స‌ర్ క‌ణాల‌ను న‌శింప‌జేయ‌డంలో ఉప‌యోగించవ‌చ్చ‌ని మిచిగాన్ విశ్వ‌విద్యాల‌య శాస్త్ర‌వేత్త‌లు క‌నిపెట్టారు. ప్లాస్మాను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోడ్‌ల వద్ద వేడి కారణంగా జనించే ధ్వని తరంగాల వల్ల ప్లాస్మా దిశ, వేగం మారిపోతాయని, వాటిని నియంత్రించ‌డం వ‌ల్ల ప్లాస్మా వాడ‌కం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని వారు పేర్కొన్నారు.

అంతేకాకుండా, ప్లాస్మాతో వైద్యం అందుబాటులోకి వస్తే గాయాలు తొందరగా మానడంలోను, వైద్య‌ప‌రిక‌రాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలోను ఉప‌యోగించ‌వ‌చ్చు. ప్లాస్మా కారణంగా పుట్టే కొన్ని ఫ్రీ రాడికల్స్‌ కేన్సర్‌ కణాలను చంపేయగలవని, అదే సమయంలో ఇది సాధారణ కణాలకు ఎలాంటి హానీ చేయదని గుర్తించినట్లు శాస్త్ర‌వేత్త అమండా లీజ్‌ తెలిపారు. అమెరికాలో వైద్య‌ చికిత్సలో ప్లాస్మా వాడకంపై నియంత్రణ ఉన్నప్పటికీ యూరప్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News