: యోగా పేరుతో హైటెక్ సిటీలో దారుణం.. యువతిపై అత్యాచారం.. ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు!
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో దారుణం జరిగింది. యోగా పేరుతో తన వద్దకు వచ్చిన యువతిపై హెచ్ఎస్‌బీసీ అధికారి అనంతరాం అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలిసిన బాధితురాలి స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.