: హైదరాబాద్‌లో పరువు హత్య.. యువకుడిని ఇంటికి తీసుకొచ్చి చంపేసిన వైనం!


హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. తన సోదరిని ప్రేమించి తీసుకెళ్లిన యువకుడిని ఆమె సోదరుడు ఇంటికి పిలిపించి మరీ హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గకు చెందిన అమర్ (26) నగరంలోని మల్లెపల్లిలోని రియాన్ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడు. ఇందిరానగర్‌ చెన్నయ్య బస్తీకి చెందిన దత్తాత్రేయ, పద్మబాయి కుమార్తె వి.కవిత (22)తో ప్రేమలో పడ్డాడు. ఈనెల 8న ఇద్దరూ కలిసి పారిపోయారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గాలించగా వారు బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది.

దీంతో వారిని తీసుకొచ్చేందుకు ఈనెల 10న కవిత సోదరుడు లక్ష్మణ్ మరో నలుగురితో కలిసి కారులో బయలుదేరాడు. 11వ తేదీ రాత్రి వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ఇద్దరినీ తమ ఇంట్లోనే ఉంచారు. మరుసటి రోజు తెల్లవారుజామున లక్ష్మణ్‌ను నిద్రలేపిన అమర్ బైక్‌పై అతడిని ఎక్కించుకుని సీతారాంబాగ్ తీసుకెళ్లి దాడిచేశాడు. బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన సోదరిని తీసుకెళ్లి తమ పరువు తీసినందునే అమర్‌ను హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News