: ఈ రోజు కాస్త తగ్గిన బంగారం ధరలు
మూడు రోజులుగా బంగారం ధరలో అనూహ్య మార్పులు కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర కాస్త తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు తగ్గి రూ.30,850గా నమోదైంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తూ 50 రూపాయలు తగ్గి, కేజీ ధర రూ.41,650కి చేరింది. అలాగే అంతర్జాయ మార్కెట్లో బంగారం 0.08 శాతం పడిపోయింది. దీంతో సింగపూర్ ఔన్స్ బంగారం ధర 1,325.90 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర 0.31 శాతం తగ్గి, ఔన్స్‌కు 17.70 డాలర్లుగా ఉంది.