: అడిగినపుడు సీటు ఇవ్వలేదని యువకుడి మీద కూర్చున్న మహిళ... వీడియో చూడండి!
సిటీ బస్సులో లేడీస్ సీట్లో కూర్చున్న పురుషులను, వారి స్థితి, గతి చూడకుండా మహిళలు వెళ్లగొట్టడం చూస్తూనే ఉంటాం. అలాంటి సంఘటనే చైనాలోని నాన్‌జింగ్ పట్టణంలో సబ్‌వే మెట్రోరైలులో జరిగింది. కాకపోతే ఇక్కడ దివ్యాంగుల సీటు కోసం మహిళ, యువకుడు వాదించుకున్నారు. ఎంతసేపు వాదించినా యువకుడు సీటు ఖాళీ చేయకపోవడంతో మహిళ అతని మీద కూర్చుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే... ఆ మహిళ, యువకుడు ఇద్దరూ వికలాంగులు కాదు!