: మీడియా సమావేశంలో షూ చూపించిన అమెరికా టెన్నిస్ స్టార్


మీడియా సమావేశంలో యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ తో సత్తాచాటిన అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్ ఓసారి అందర్నీ నవ్వించింది. కెరీర్‌ లో తొలి గ్రాండ్‌ స్లామ్ సాధించిన స్లోవానే స్టీఫెన్స్ మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెపైకి ఒక పురుగు దాడి చేసింది. దీంతో తొలుత భయపడ్డ స్టీఫెన్స్, తరువాత దానిని తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా అది మీదికి రావడంతో ఇక లాభం లేదని భావించిన స్టీఫెన్స్ తన కాలికి ఉన్న షూ తీసి, దానిని చంపేసింది.

ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఇంత చిన్న పురుగుకు బయపడతావా?’ అని ఒకరంటే ‘నీ ఆట నచ్చి ప్రెస్ మీట్‌ లో ఎగరడానికి వచ్చింది’ అని మరొకరు ఇలా పలురకాల వ్యాఖ్యలతో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News