: ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టు ఎంపికపై అజారుద్దీన్ విమర్శలు


ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరగనున్న సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుపై మాజీ కెప్టెన్ అజారుద్దీన్ విమర్శలు గుప్పించారు. ఆసీస్ వంటి బలమైన జట్టుతో ఆడేటప్పుడు జట్టును ఇలాగానే ఎంపిక చేసేది? అని ఆయన ప్రశ్నించారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీశారు. ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకమైనదని అన్నారు. శ్రీలంక పర్యటనకు అశ్విన్, జడేజాలకు విశ్రాంతిని ఇవ్వడంలో తప్పులేదని... ఆస్ట్రేలియా సిరీస్ కు వారిని దూరం పెట్టడమేంటని ప్రశ్నించారు. పటిష్టమైన ఆసీస్ పై అత్యుత్తమ స్పిన్నర్లను ఉపయోగించుకోవాలని అన్నారు. ఒకవేళ ఈ సిరీస్ కు తాను కెప్టెన్ గా ఉన్నట్టైతే అశ్విన్, జడేజాలను కచ్చితంగా ఆడించేవాడినని చెప్పారు.

  • Loading...

More Telugu News