: అరెస్ట్ చేసి తెండి... నాగం జనార్దన్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన కోర్టు


ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేశారని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వేసిన కేసులో విచారణకు హాజరు కాని నాగం జనార్దన్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై చార్జ్ షీట్ నమోదుకాగా, విచారణకు మాత్రం ఆయన రావడం లేదు.

 ఎన్నిమార్లు నోటీసులు పంపినా నాగం నుంచి సమాధానం రాకపోవడంతో హైదరాబాద్ కోర్టు నేడు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తూ, ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలపాలని ఆదేశించింది. కాగా, ఈ విషయంలో నాగం స్పందించాల్సి వుంది. ఓబులాపురం మైనింగ్ గనుల విషయంలో వైఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అప్పట్లో నాగం తీవ్ర ఆరోపణలు చేయగా, దానిపై ప్రభుత్వం కేసు వేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News