: చాందిని హత్య కేసులో కీలక పురోగతి... చాందిని ఫోన్ లో 'మై హాట్ ఫోన్ నెంబర్'.. చాలా సంభాషణలు!


హైదరాబాదులో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి సన్నిహితుల నుంచి విచారణ ప్రారంభించారు. అలాగే సంఘటనా స్థలంలో లభించిన ఫోన్ లోని కాంటాక్ట్స్ వైపు దృష్టి సారించారు. ఆమె కాల్ లిస్ట్ ను పరిశీలించారు. ఇందులో నాలుగు పేర్లు కనిపించాయి. ఆ నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా చాందిని కాంటాక్ట్స్ లో ఉన్న 'మై హాట్ ఫోన్ నెంబర్'తో ఆమె ఎక్కువగా మాట్లాడినట్టు గుర్తించారు. ఈ నలుగురూ చాందిని ఇంటికి ఎక్కువగా రావడాన్ని గుర్తించారు. అంతే కాకుండా పార్టీ కోసం జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ కు వెళ్లినట్టు గుర్తించారు. 

  • Loading...

More Telugu News