: మరణించినా అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి... పార్టీ ఆర్గనైజర్ గా పన్నీర్ వ్యవహరిస్తారు!: పళనిస్వామి


భౌతికంగా అమ్మ దూరమైనా, పార్టీకి సంబంధించినంత వరకూ ఆమే శాశ్వత ప్రధాన కార్యదర్శని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ ఉదయం పార్టీ సర్వసభ్య సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంను తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ పార్టీ ఆర్గనైజర్ గా నియమించామని, ఆయన నేతృత్వంలోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు.

అమ్మ గతంలో నియమించిన వారు తమ తమ పదవుల్లో కొనసాగుతారని తెలిపారు. శశికళ, దినకరన్ లకు పార్టీలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఎంజీఆర్ మరణం తరువాత పార్టీ అధ్యక్ష పదవిని మరెవరికీ కేటాయించకుండా, జనరల్ సెక్రటరీ పదవిలో జయలలిత కొనసాగుతూ, పార్టీని నడిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి తరువాత ఆ పదవిని మరొకరికి కేటాయించరాదని నిర్ణయించామని పళనిస్వామి స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో శశికళ శకం ముగిసినట్టేనని తెలిపారు.

  • Loading...

More Telugu News