: బాబా రాందేవ్ ఓ దొంగ బాబా: దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల సంచలన ట్వీట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్... తాజాగా యోగా గురు బాబా రాందేవ్ ను టార్గెట్ చేశారు. రాందేవ్ ఓ దొంగ బాబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రాందేవ్ అనుచరులను కూడా ఆయన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఓ ట్వీట్ చేశారు. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేరుతో ఓ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్గీరాజా మాట్లాడుతూ, రాందేవ్ బాబా పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను నిరాశకు గురి చేసిందని అన్నారు.

పతంజలి బ్రాండ్ పేరుతో నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ బాబా వ్యాపారం చేస్తున్నారని దిగ్విజయ్ మండిపడ్డారు. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా దొంగ బాబానే అని ఆయన అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయ వస్త్రాలు ధరించే వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చా? లేదా? అనే విషయాన్ని అఖిల భారతీయ ఆకార పరిషత్ తెలిపాలని కోరారు. దొంగ బాబాల జాబితాలో రాందేవ్ బాబాను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News