: హైదరాబాద్ లో దారుణం... ఇంటర్ విద్యార్థిని హత్య.. స్నేహితుడిపైనే అనుమానాలు!


హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగర పరిధిలోని మదీనాగూడలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న బాలిక, స్నేహితులతో పార్టీ ఉందని, వారిని కలసి వస్తానని మూడు రోజుల క్రితం ఇంట్లో చెప్పి వెళ్లిన చాందిని, ఆపై ఇంటికి తిరిగి రాకపోగా, తల్లిదండ్రులు పోలీసు రిపోర్టు ఇచ్చారు. ఆ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు, విచారిస్తుండగానే, అమీన్ పూర్ కొండల్లో ఓ యువతి మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో అక్కడికి వెళ్లి, ఆమె చాందినిగా గుర్తించారు.

ఆమెను హత్య చేసి కొండల్లో పడేశారని తేల్చిన పోలీసులు, అత్యాచారానికి గురైందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. చాందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె కలిసొస్తానన్న స్నేహితుడు ఎవరన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతనే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేదా మరెవరైనా ఉన్నారా? అన్న విషయంలో విచారణను ముమ్మరం చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. చాందినీ జైన్ మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News