: బౌద్ధ మత అమ్మాయిలను 'లవ్ జీహాద్' ముగ్గులోకి దింపుతున్న ముస్లిం యువకులు... లడఖ్ లో టెన్షన్!


కాశ్మీర్ లోని లడఖ్ ప్రాంతాన్ని ఇప్పుడు కొత్త సమస్య వెంటాడుతుండగా, పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ముస్లింలు 49 శాతం ఉండగా, బౌద్ధమతస్తులు 51 శాతం ఉన్నారు. ముస్లిం యువకులు 'లవ్ జీహాద్' అస్త్రాన్ని ప్రయోగిస్తూ, తమ అమ్మాయిలను వశపరచుకుని, వారిని ఇస్లాం మతంలోకి మారుస్తున్నారన్నది లడఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ (ఎల్బీఏ) ప్రధాన ఆరోపణ. ఇటీవల ద్రాస్ సెక్టార్ కు చెందిన ముర్తాజా అఘా (32) అనే యువకుడు, 30 సంవత్సరాల బౌద్ధమత అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఆమెను ముస్లిం మతంలోకి మార్చి షైఫాగా పేరును మార్చాడు.

 తానే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని షైఫా చెబుతూ, సీఎం మెహబూబా ముఫ్తీకి లేఖను రాసినప్పటికీ, ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని ఎల్బీఏ నిరసనలకు దిగుతోంది. ఆమెను ఒత్తిడి చేసి అటువంటి లేఖను రాయించారని, ముస్లింలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ, సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఎల్బీఏ ప్రతినిధి పీటీ కున్జాంగ్ వెల్లడించారు. జరుగుతున్న ఘోరాన్ని తాము చూస్తూ ఊరుకోలేకపోతున్నామని ఆయన అన్నారు.

గడచిన నాలుగేళ్ల వ్యవధిలో 45 లవ్ జీహాదీ ఘటనలు జరిగాయని, మరింత మంది అమ్మాయిలపై ముస్లిం యువకులు వల విసురుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, బౌద్ధ అమ్మాయిలకు పెళ్లి తరువాత మాత్రమే తాము ప్రేమించి మనువాడిన వ్యక్తి ముస్లిం అన్న సంగతి తెలుస్తోందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News