: ఉత్తరకొరియాకు మరో ఎదురుదెబ్బ.. తాజా ఆంక్షలను ఏకగ్రీవంగా ఆమోదించిన ఐరాస భద్రతా మండలి
అమెరికాపై కత్తులు దూస్తున్న ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి మరోమారు ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఆ దేశంపై ఆంక్షలు కొనసాగుతుండగా సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోమారు ఏకగ్రీవంగా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా తాజాగా నిర్వహించిన ఆరోది, అతిపెద్దది అయిన అణు పరీక్ష నేపథ్యంలో అమెరికా రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనకు భద్రతా మండలి ఓకే చెప్పింది. తాజా ఆంక్షల ప్రకారం.. ఉత్తర కొరియా టెక్స్‌టైల్ ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు అమలుకానున్నాయి. ఉత్తరకొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం 2006 నుంచి ఇప్పటి వరకు తొమ్మిదోసారి.