: పాత్రికేయులపై కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలు.. వారికి అక్షరం ముక్కరాదన్న మంత్రి!
పాత్రికేయులపై కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు అక్షరం ముక్క రాదని వ్యాఖ్యానించారు. వారికే ప్రశ్నలు అడగాలో, ఏం రాయాలో తెలియకుండా పోయిందన్నారు. అంతా హడావిడి మనుషులేనని అన్నారు. అయితే, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని జర్నలిస్టులు ఇందుకు మినహాయింపు అని మంత్రి పేర్కొన్నారు. వారు అటువంటి ప్రశ్నలతో విసుగు తెప్పించరని కితాబిచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. తమ వృత్తే ప్రశ్నలు అడిగి, నిజాలు రాబట్టడం అన్న విషయం మంత్రికి తెలియకపోవడం బాధాకరమన్నారు.