: కంచ ఐలయ్యకు అలా రాసే హక్కు ఉంది.. కొడతాం, చంపుతాం అని బెదిరించే హక్కు ఎవరికీ లేదు: మహేశ్ కత్తి


‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అని టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి స్పందిస్తూ.. ‘ఇక్కడ హక్కులు దళితులకా? అధికార కులాలకా? అనేది కాదు. రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెష‌న్ అందరికీ ఉంది. కానీ కొడతాం, చంపుతాం అని బెదిరించే హక్కు ఎవరికీ లేదు. కంచ ఐలయ్య గారు రాసింది అభ్యతరకరం అయితే అభ్యంతరాన్ని తెలపండి. కౌంటర్ థియరీ ఆఫర్ చెయ్యండి. అఫెన్సివ్ అనిపిస్తే కోర్టుకు వెళ్ళండి. ఇవన్నీ అందరికీ ఉన్న హక్కులే. కానీ చట్టం రక్షణ కల్పించిన హక్కుకు హాని కలిగిస్తూ, అది మా హక్కు అని మాత్రం అనకండి’ అని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. అంత‌కు ముందు మ‌రో పోస్ట్ చేస్తూ కంచ ఐల‌య్య రాసిన బుక్‌లో రాసిన అభిప్రాయాల‌ను తాను అంగీక‌రిస్తున్నానా? లేదా? అనేది మేట‌ర్ కాద‌ని, ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెష‌న్ అందరికీ ఉంద‌నేదే మేట‌ర‌ని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News