: సిమ్ లను ఆధార్ తో అనుసంధానం చేయకుంటే ఇకపై పనిచేయవు!


ఇకపై ప్రతి మొబైల్ ఫోన్ నంబర్ ను ఆధార్ నెంబర్ తో జతపరచక తప్పదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సిమ్ కార్డును ‘ఆధార్’ తో అనుసంధానం చేయాలని,  2018 ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రకటించిన గడువులోగా అనుసంధానం కాకుంటే ఆ సిమ్ లు పనిచేయవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్ కార్డు విక్రయ సమయంలో వినియోగదారుడి ఫింగర్ ప్రింట్ ను బయోమెట్రిక్ విధానంలో తీసుకోవడం ద్వారా ‘ఆధార్’ తో సరిపోల్చడం ద్వారా నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. కాగా, లోక్ నీతి ఫౌండేషన్ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్ నంబర్లకు ‘ఆధార్’ను అనుసంధించాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది.

  • Loading...

More Telugu News