: `సైరా` సినిమా సంగీతం పనులు మొదలు పెట్టిన ఏఆర్ రెహమాన్!
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా` సినిమాకు స్వరాలు సమకూర్చే పనిలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రయూనిట్‌తో ఇప్పటికే ఆయన రెండు మూడు సార్లు సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ చిత్రంలో ప్రతి ఒక్క పాట మెగా అభిమానులకు నచ్చే విధంగా ఉండేలా నిర్మాత రామ్ చరణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా పీరియాడిక్ సమయానికి దగ్గరగా ఉండనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. వివిధ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయా భాషలకు సంబంధించిన నటీనటులు ఉండేలా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ పెద్దమల్లారెడ్డిగా నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార, ప్రజ్ఞా జైశ్వాల్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నాజర్, ముకేష్ రుషి, రఘుబాబు, సుబ్బరాజులు కీలక పాత్రలు పోషించనున్నారు.