: నంద్యాల ప్రచారంలో జగన్ వ్యాఖ్యలు ఓటమి బాటలో నడిచేలా చేశాయి!: వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
నంద్యాల ఉపఎన్నికల సమయంలో సజావుగా సాగుతున్న తమ ప్రచారానికి జగన్ వ్యాఖ్యలే అడ్డంకిగా నిలిచి, తమ పార్టీని ఓటమి బాటలో నడిచేలా చేశాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఉపఎన్నికల్లో విజయం ఖాయమనుకునే సందర్భంలో, బహిరంగ సభలో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు బెడిసి కొట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు.
`నేను జగన్ ప్రసంగం చూశాను. చాలా ఆకట్టుకునేలా ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డితో సభాముఖంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడం, ఇతర ప్రసంగాలు ప్రజల్లోకి చొచ్చుకుని పోయాయి. కానీ చివర్లో చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది` అని ఆయన అన్నారు.