hebah patel: ఒకే మూవీలో ఐదుగురు కథానాయికలు!


మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన సినిమాలు సహజంగానే తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. అలా తాజాగా '100 డిగ్రీస్ సెల్సియస్' చిత్రం కూడా తమిళ .. తెలుగు భాషల్లోకి రీమేక్ అవుతోంది. హెబ్బా పటేల్ .. నందిత శ్వేత .. రాయ్ లక్ష్మి .. రాగిణి ద్వివేది .. నికీషా పటేల్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను చేస్తున్నారు.

తెలుగులో సూపర్ హిట్ అనిపించుకున్న 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాకి ఓ తమిళ సినిమా మూలం. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన మిత్రన్ జవహర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో హెబ్బా పటేల్ .. నందితా శ్వేత కలిసి నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా హిట్ కొట్టింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తోన్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంది.     

hebah patel
nandita swetha
  • Loading...

More Telugu News