: ఏ కారణంతో యువీని ఎంచుకోలేదు...రైనా కంటే కేదార్ మంచి ఫినిషరా?:బీసీసీఐకి నెటిజన్ల ప్రశ్నలు


ఈ నెల 17 నుంచి భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి మూడు వన్డేలకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్, సురేష్ రైనాలను ఎంపిక చేయలేదు. దీంతో సగటు అభిమానికి ఆగ్రహం వచ్చింది. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు. యువరాజ్ సింగ్ ను ఏ కారణంతో ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే సురేష్ రైనాను ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. సురేష్ రైనా కంటే కేదార్ జాదవ్ మంచి మ్యాచ్ ఫినిషరా? అని ప్రశ్నిస్తున్నారు. ఆసీస్ తో సిరీస్ లో అంతా కొత్త వాళ్లైతే విజయం వస్తుందా? అనుభవంతో పని లేదా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులకు మాత్రమే టీమిండియాలో కోహ్లీ అవకాశం కల్పిస్తున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

  • Loading...

More Telugu News