: ప్రెస్మీట్లో పురుగును చూసి భయపడిన టెన్నిస్ క్రీడాకారిణి... వైరల్ అవుతున్న వీడియో!
యూఎస్ ఓపెన్‌లో టైటిల్‌తో తన కెరీర్లో మొదటి గ్రాండ్‌స్లామ్ సాధించిన అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ గెలిచిన తర్వాత నిర్వహించిన ప్రెస్మీట్లో ఓ చిన్న పురుగును చూసి భయపడుతూ, ఆమె ఇచ్చిన హావభావాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి.
ఆ పురుగు నుంచి తప్పించుకోవడానికి ఆమె మీడియా ముందే కుర్చీ నుంచి కిందకి వెళ్లడం, చివరికి తన కాలి బూటుతో పురుగును చంపడం ఈ వీడియోలో చూడొచ్చు. తర్వాత `ఆ పురుగు నాకు డ్రాగన్‌లా కనిపించింది. చాలా అసహ్యంగా ఉంది` అంటూ ఆమె మీడియా సమావేశాన్ని కొనసాగించింది. దీనిపై నెటిజన్లు వివిధ ఛలోక్తులు వదిలారు. `వేగంగా టెన్నిస్ బంతిని అడ్డుకునే నువ్వు... చిన్న పురుగుకు భయపడతావా?`, `దానికి నీ ఆట నచ్చింది. అందుకే నీ ప్రెస్మీట్లో ఎగరడానికి వచ్చింది` అంటూ హాస్యాన్ని పండించారు.