: పోప్ ప్రాన్సిస్ కు గాయాలు... చిందిన రక్తం!


క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ కు చిన్న ప్రమాదం జరిగి గాయాలై, రక్తం చుక్కలు నేల చిందగా, క్రైస్తవ సమాజం ఆందోళన చెందింది. కొలంబియాలో ఆయన భారీ జన సమూహం మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ జీపులో పర్యటిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. భారీ జన సమూహం మధ్య వాహనం కుదుపుకు లోను కాగా, నిలువుగా ఉన్న ఇనుప కడ్డీకి ఆయన తల తగిలింది.

 దీంతో తలకు బొప్పి కట్టడంతో పాటు, ఎడమకంటి పక్కన, దవడ ఎముక భాగంలో గాయాలు అయ్యాయి. జరిగిన ఘటనపై వాటికన్ సిటీ ఓ ప్రకటన చేస్తూ, పోప్ కు స్వల్ప గాయాలే అయ్యాయని, ఆయనకు ఐస్ తో ట్రీట్ మెంట్ చేశారని, కొలంబియాలో ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిపింది. అభిమానులు, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, 'నాకు పంచ్ పడింది. నేను బాగానే ఉన్నాను' అని గాయమైన తరువాత పోప్ జోక్ వేశారు.

  • Loading...

More Telugu News