: గౌరీ లంకేష్ ఇల్లు ఎక్కడ? అని అడిగారు: అజ్ఞాత వ్యక్తి ఫోన్
ప్రముఖ కన్నడ పాత్రికేయురాలు గౌరి లంకేష్ హత్య ఘటనలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో రాత్రి 7:30 గంటల సమయంలో ఒక వ్యక్తి కన్నడ ఇంగ్లీషు యాసతో గౌరీ లంకేష్ ఇల్లు ఎక్కడ? అని తనను అడిగాడని ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఆయన అడిగిన వివరాల ప్రకారం గౌరీ లంకేష్ ఎవరో కూడా ఆయనకు తెలియదని భావించానని ఆయన తెలిపారు.
అయితే చీకటి కారణంగా అతని ముఖం సరిగా కనింపించలేదని ఆయన పోలీసులకు తెలిపారు. దీంతో ఈ హత్యను ప్రొఫెషనల్ కిల్లర్స్ లేదా సిద్ధాంతం కోసం వ్యక్తులను హతమార్చే వ్యక్తులు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు రెక్కీ నిర్వహించి, హంతకులకు సహకారం అందించి ఉంటారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.