: ఆహా..! నీ వల్లే గెలిచామా? మరి ఆ 107 మంది ఎందుకు ఓడారో.. జగన్‌కు మంత్రి ఆదినారాయణరెడ్డి సూటి ప్రశ్న
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వల్లే తామంతా గెలిచామని జగన్ తరచూ చెబుతుంటారని, మరి గత ఎన్నికల్లో ఓడిపోయిన 107 మంది ఎమ్మెల్యే, 17 మంది ఎంపీ అభ్యర్థుల ఓటమికి కూడా ఆయనే కారణమా? అని ప్రశ్నించారు. ఆయన వల్లే గెలిచామని చెబుతున్న జగన్, ఓడిపోయింది కూడా ఎవరి వల్లో చెప్పాలని నిలదీశారు.
వారి ఓటమికి కారణం తానేనని జగన్ అంగీకరిస్తే, తాము గెలిచింది జగన్ వల్లేనని అంగీకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని పది స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కడపలో ఆదివారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.