: దొంగ బాబాలు వీరే.. 14 మందితో జాబితా విడుదల చేసిన అఖాడా పరిషత్


స్వయం ప్రకటిత దేవుళ్లుగా ప్రకటించుకుంటున్న వారి వల్ల మొత్తం సాధు సంతులుకు చెడ్డపేరు వస్తోందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 14 మంది దొంగ బాబాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్, జైల్లో ఉన్న మరో బాబా ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇటువంటి దొంగ బాబాల వల్ల ‘సంత్’కు ఉన్న గౌరవం దెబ్బ తింటోందని అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి అన్నారు.
 
ఇకపై సంత్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ అఖాడా పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక సేవలో ఉన్నవారిని ఇకపై వారి వ్యవహారాలను పూర్తిగా తెలుసుకున్నాకే సంత్‌గా గుర్తిస్తారు. సాధువులకు ఇకపై వ్యక్తిగతంగా ఎటువంటి ఆస్తులు కానీ, నగదు కానీ ఉండకూడదని అఖాడా పరిషత్ నిర్ణయించినట్టు వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు.
 

  • Loading...

More Telugu News