: ఈ సినిమాకు బీజం అక్కడ పడింది!: నందమూరి హరికృష్ణ


‘జై లవ కుశ’ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించడానికి కారణం తన పెద్ద కొడుకు జానకిరామ్ అని నందమూరి హరికృష్ణ అన్నారు. ‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ‘ఓ రోజు జానకిరామ్ బాబు.. కళ్యాణ్ రామ్ బాబుతో ఏమన్నాడంటే.. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరు పెట్టుకోవడం కాదు, ఈ బ్యానర్ పై తమ్ముడితో సినిమా చేయాలి’ అని అన్నాడు. అప్పుడే, ‘జై లవ కుశ’ సినిమాకు బీజం పడింది’ అని అన్నారు. ‘జై లవ కుశ’లో ‘జై’ పాత్ర తనకు నచ్చిందని, ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నవ్వు చూస్తుంటే.. నాడు సీతారామ కళ్యాణం చిత్రంలో తన తండ్రి నవ్వు గుర్తుకు తెస్తోందని అన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని హరికష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News