: మా వాళ్లపై దాడులు జరగకుండా చూడండి!: కర్ణాటక సీఎంకు వైఎస్ జగన్ వినతి
కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై, ఉద్యోగులపై దాడి జరిగిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ దాడులు జరగకుండా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం సిద్ధరామయ్యకు జగన్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆయన కోరారు.
‘తెలుగు ఉద్యోగార్థులపై కర్ణాటకలో దాడులు శోచనీయం. వారి భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ముందుకుసాగాలి. మరోవైపు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇంత పెద్ద సంఖ్యలో యువత వెళ్తున్న తీరు - మన రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తోంది. దీనిపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నాను’ అని తన ప్రకటనలో కోరారు.