: ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్ విడుదల.. హాస్యనటుడు సునీల్ నోట ‘మెగాస్టార్’ చెప్పిన డైలాగ్ !
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉంగరాల రాంబాబు’’ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. ‘ఖైదీ నంబరు 150’ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా .. కాదని బలవంతం చేస్తే కోస్తా’ అనే డైలాగ్ ను సునీల్ చెబుతూ ఈ ట్రైలర్ లో కనిపిస్తాడు.
‘పిల్ల బాదం పిక్కలా పిటపిట లాడిపోతోంది’, ‘రాత్రంతా భక్త ప్రహ్లాద సినిమా చూశానండి, అందుకే లెగడం కొంచెం లేటయిందండి’,‘దేశం వెనక పడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు..మానవత్వం లేకపోవడం’ అనే డైలాగ్స్ ను వేర్వేరు సందర్బాల్లో సునీల్ చెప్పడం ఈ ట్రైలర్ లో గమనించవచ్చు. స్వగ్రామం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి పాత్రలో ప్రకాశ్ రాజు కనిపించారు. కాగా, ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి పరుచూరి కిరీటి నిర్మాతగా వ్యవహరించగా, గిబ్రన్ సంగీతం అందించారు.