charan: చరణ్ తోనే రాజమౌళి నెక్స్ట్ మూవీ అంటూ రూమర్!


చరణ్ .. రాజమౌళి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'మగధీర' .. వరుస రికార్డులను సృష్టించిందనే సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకు సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న  'సైరా నరసింహ రెడ్డి' టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన 'శ్రీ వల్లి' సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనేననే ప్రచారం జోరందుకుంది. 'రంగస్థలం 1985' తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని చెప్పుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News