: దేవుడు ఆశీర్వదించుగాక: ఇర్మాపై ట్రంప్ ట్వీట్
అమెరికాను తాకనున్న ఇర్మా తుపాను ప్రభావాన్ని సాధ్యమైనంతగా తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, ఇక దేవుడిపైనే భారం వేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, 'ఇర్మా ఇప్పుడు అమెరికా తీరాన్ని చేరుకుంది. దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించునుగాక' అని ట్వీట్ చేశారు. ఇర్మాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తీర ప్రాంత గస్తీ దళాలతో పాటు ఫెమా బలగాలను, ఫెడరల్ బృందాన్ని, రాష్ట్ర విపత్తు బృందాలను సిద్ధంగా ఉంచామని, కష్టాల్లో పడ్డ ప్రజలను వారు రక్షిస్తారని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చెప్పారు. ఇప్పటివరకూ అడుగుపెట్టిన ప్రతి చోటా బీభత్సం సృష్టించిన ఇర్మా, ఇప్పుడు ఫ్లోరిడాపై తన ప్రతాపాన్ని చూపుతోంది.