: కాణిపాకంలో అపశ్రుతి... కుప్పకూలిన పుష్పపల్లకి!
కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి దొర్లింది. స్వామి వారిని ఊరేగిస్తున్న పుష్పపల్లకి ఒక్కసారిగా కుప్పకూలింది. పల్లకిని వేలాది పుష్పాలతో అలంకరించగా, ఊరేగింపు ముగింపు దశకు వస్తున్న వేళ, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు, పల్లకికి అలంకరణగా ఉన్న పూలను అందుకోవడం కోసం ఒక్కసారిగా ఎగబడ్డ వేళ ఈ ఘటన జరిగింది. భక్తులు ఒక్కసారిగా తోపులాటకు దిగారని, పుష్పపల్లకి కూలిన ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.