: చిన్నప్పుడు చబ్బీ, ఇప్పుడు రియల్ బాండ్ లా ఉన్నాడు... మహేశ్ ను చూసిన తరువాత రజనీకాంత్ అభిప్రాయమిది!


'స్పైడర్' చిత్రం ఆడియో విడుదల వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించేందుకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లిన వేళ, జరిగిన ఓ ఆసక్తికర ఘటనను దర్శకుడు మురుగదాస్ అభిమానులతో పంచుకున్నాడు. 'స్పైడర్' ఆడియో విడుదల వేదికపై మాట్లాడిన మురుగదాస్, "రజనీకాంత్‌ గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేశ్‌ బాబును చూసి, ‘చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్టైలిష్‌గా, రియల్ బాండ్‌ లా ఉన్నాడు. లుక్‌ అదిరిపోయింది అని మెచ్చుకున్నారు. దాంతో నేను థ్రిల్‌ ఫీల్ అయ్యాను. ఆయన మహేశ్‌ గురించి చాలాసేపు మాట్లాడారు" అన్నాడు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తాను, మహేశ్, కార్తి, సూర్య, దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నైలోని ఒకే స్కూల్ లో చదువుకున్నామని గుర్తు చేసుకున్నాడు. మిగతా అందరితో తాను సినిమాలు చేశానని, మహేశ్ తో మాత్రమే తీయలేదని, ఆ కోరిక ఇప్పుడు తీరిందని అన్నాడు. 'గజనీ'ని మించిన హిట్ ను 'స్పైడర్' సొంతం చేసుకోనుందని అంచనా వేశాడు.

  • Loading...

More Telugu News