renu desai: తెలుగు డాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్న రేణుదేశాయ్!


పవన్ కల్యాణ్ తో వున్నప్పుడు ఆయన సినిమాలకి సంబంధించిన వ్యవహారాలను రేణు దేశాయ్ దగ్గరుండి చూసుకునేవారు. ఆయన నుంచి విడిపోయిన తరువాత కూడా ఆమె తన దృష్టిని సినిమాలపైనే పెట్టారు. ఆ మధ్య ఆమె ఒక సినిమాకి దర్శకత్వం వహించారు కూడా. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే రేణు దేశాయ్ కి ఎంతో మంది అభిమానులు వున్నారు.

 అలాంటి రేణు దేశాయ్ త్వరలో తెలుగు బుల్లితెరపై హోస్ట్ గా కనిపించనున్నట్టు సమాచారం. స్టార్ మా 'బిగ్ రియాలిటీ డాన్స్ షో' పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేసిందట. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. ఈ షోకి రేణు దేశాయ్ ను వ్యాఖ్యాతగా ఎంపిక చేసుకున్నారట. పవన్ తో పాటు రేణు దేశాయ్ ను అభిమానించే వారికి ఇది ఆసక్తిని కలిగించే విషయమనే చెప్పాలి.    

renu desai
  • Loading...

More Telugu News