: సెల్‌ఫోన్‌లో దేవత చేతి రూపంలోని వెలుగు కనిపిస్తోందంటూ.. ఆలయానికి భారీగా తరలివస్తోన్న భక్తులు!
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం చిగురుపాడు అగ్రహారంలో పోలేరమ్మ ఆలయానికి ఒక్కసారిగా భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆ గుడిలో ఓ వింత చోటు చేసుకుంటోందన్న వార్త ఒకరి నోటి వెంట మరొకరికి పాకి హల్‌చల్ చేస్తోంది. భక్తులకు అభయం ఇస్తున్నట్లు ఓ భక్తురాలి సెల్‌ఫోన్‌లో దేవత చేతి రూపంలోని వెలుగు కనిపిస్తోందని ఆ గ్రామవాసులు చెప్పుకుంటున్నారు. దీనితో పూజా సామగ్రి తీసుకుని పూజలు చేయడానికి తరలి వెళుతున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా పోలేరమ్మ ఆలయం భక్తులతో నిండిపోతోంది.