: మలయాళీ పాటను మెచ్చుకున్న అమెరికన్ యాంకర్ జిమ్మీ కెమ్మెల్!
ప్రస్తుతం `జిమిక్కీ కమ్మాల్` అనే పాటకు మలయాళీలంతా స్టెప్పులేస్తున్నారు. ఇటీవల కేరళలో జరిగిన ఓనం పండుగలో ఈ పాటకు డ్యాన్స్ చేయని మలయాళీ లేడంటే అతిశయోక్తి కాదేమో! అంతలా పిచ్చెక్కిస్తోంది ఈ పాట. ఇప్పుడు ఇదే పాటను ప్రముఖ అమెరికన్ టీవీ యాంకర్ జిమ్మీ కెమ్మెల్ కూడా మెచ్చుకున్నాడు.
`జిమిక్కీ కమ్మాల్` పాటకు కేరళలోని ఓ కాలేజీ అమ్మాయిలు డ్యాన్స్ వేస్తున్న వీడియోను ఓ నెటిజన్ జిమ్మీ కెమ్మెల్‌కి పంపించాడు. `ఈ పాట విన్నావా?` అని ఆ నెటిజన్ జిమ్మీని ప్రశ్నించాడు. దీనికి జిమ్మీ సమాధానం చెబుతూ - `ఇప్పటివరకు వినలేదు. కానీ పాట నాకు చాలా నచ్చింది` అన్నాడు. అయితే ఈ పాటను తన కార్యక్రమం `జిమ్మీ కెమ్మెల్ లైవ్`లో ప్రస్తావించే అవకాశం ఉందని, ఆ ఉద్దేశంతోనే జిమ్మీ తిరుగు సమాధానం చెప్పాడని భారత అమెరికన్ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పాట మోహన్ లాల్ నటించిన `వెలిపాడింటే పుస్తగం` సినిమాలోనిది. ఇది గత నెలలో ఓనం పండుగకు విడుదలైంది.