: రైల్వే ఉద్యోగంలో పదోన్నతి పొందిన మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్!
మహిళా ప్రపంచకప్ క్రికెట్ సెమీ ఫైనల్లో 171 పరుగులు తీసిన బ్యాట్స్ఉమెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కి పదోన్నతి లభించింది. 2014 మే నుంచి ఆమె పశ్చిమ రైల్వే జోన్‌లో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మహిళా ప్రపంచకప్ క్రికెట్‌లో చూపిన ప్రతిభకు గాను ఆమెను రైల్వే క్రీడల విభాగంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పదోన్నతి కల్పిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్మన్‌కు గ్రూప్-బి ర్యాంకులో గెజిటెడ్ స్థాయి పదోన్నతి కల్పించినట్లు పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఏ కే గుప్త, హర్మన్‌కు అభినందనలు తెలియజేశారు.