: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ ను మించినవారు లేరు.. బీజేపీ, టీఆర్ఎస్ లు కలసి పోటీ చేయబోతున్నాయి: జైపాల్ రెడ్డి
భారతదేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు అత్యంత ప్రమాదకరమైనవని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ కు ఏ మాత్రం పారదర్శకత ఉండదని అన్నారు. అబద్ధాలను అందంగా చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించినవారు లేరని విమర్శించారు. ప్రధాని మోదీ, కేసీఆర్ లు అబద్ధాలను చెప్పడంలో పోటీపడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలసి కేసీఆర్ పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఎస్సీలకు మూడు ఎకరాలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టారని విమర్శించారు. కేసీఆర్ ఇంటింటికీ నీళ్లను ఇవ్వలేరని, వచ్చే ఎన్నికల్లో ఓట్లనూ అడగలేరని అన్నారు. శంషాబాద్ లో ఈరోజు టీకాంగ్రెస్ నేతలకు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైపాల్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.