: హైదరాబాద్ లో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్.. లక్నోకి తరలింపు!


హైదరాబాదులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జాడలు కలకలం రేపాయి. నగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. యూపీ రాజధాని లక్నో నుంచి వచ్చిన అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో అబ్దుల్ మాలిక్, ఫజీయుల్లా, ఖయ్యూం అనే వ్యక్తులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఖయ్యూం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. యూపీలో జరిగిన బాంబు పేలుళ్లలో వీరి హస్తం ఉంది. వీరు ముగ్గురినీ ఎన్ఐఏ అధికారులు ఉత్తరప్రదేశ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News