: ఆంగ్‌సాన్ సూకీకి ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోబోం: స్పష్టం చేసిన నోబెల్ సంస్థ
మయన్మార్ కౌన్సిలర్, ఆ దేశ ముఖ్యనేత ఆంగ్ సాన్ సూకీకి ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకునే ఉద్దేశం కానీ, రద్దు చేసే ఆలోచన కానీ లేదని నార్వేకు చెందిన నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పష్టం చేసింది. ఒకసారి దానిని ప్రదానం చేసిన తరువాత అటువంటి ఆలోచన చేయబోమని కుండబద్దలు కొట్టింది. మయన్మార్‌లో రోహ్యంగా ముస్లింలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని రద్దు చేయాలంటూ 4 లక్షల మంది సంతకాలతో కూడిన ఆన్‌లైన్ పిటిషన్ అందింది. దీనిపై నోబెల్ సంస్థ స్పందిస్తూ సూకీ శాంతి బహుమతిని రద్దు చేయబోమని స్పష్టం చేసింది.