: ఉత్తరకొరియా తాజా మిస్సైల్ పరీక్ష నేపథ్యంలో... జపాన్ లో అడుగుపెట్టిన అమెరికా సైన్యం!


ఉత్తరకొరియా నేడు మరో బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష నిర్వహించనుందన్న వార్తల నేపథ్యంలో జపాన్ లో అమెరికా సైనికులను మోహరించింది. బాలిస్టిక్ క్షిపణుల్ని గ్వామ్ ద్వీపం లక్ష్యంగా ఉత్తరకొరియా ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యంగా ప్రయోగించే క్షిపణులన్నీ జపాన్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జరగరాని సంఘటన జరిగితే ఉత్తరకొరియాను ఎదుర్కొవడం జపాన్ సైన్యం వల్ల కాని పని అని గ్రహించిన జపాన్ ప్రభుత్వం అమెరికా సహాయం కోరింది.

దీంతో అలస్కా బ్రిగేడియర్ వెయిన్‌ వ్రైట్ ఆధ్వర్యంలో సైనికులు జపాన్ తీరప్రాంతం ఓరియంట్ షీడ్‌ లో అడుగుపెట్టారని జపాన్ తెలిపింది. ఈ ప్రయోగం నేపథ్యంలో తమ దేశ సైనికుల్లో ఆత్మస్థైర్యం నిపేందుకు ఆరు వందల బెటాలియన్ల అమెరికా దళాలు జపాన్‌ కు చేరుకున్నాయని చెప్పింది. జపాన్ సైన్యానికి యుద్ధ శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే రెండు వారాల పాటు కార్యక్రమాలు నిర్వహించిందని, అమెరికా సైన్యం తమకు ఎంతో సహకరించిందని జపాన్ తన ప్రకటనలో తెలిపింది. 

  • Loading...

More Telugu News