GodavariUS: ప్రెస్ నోట్: శరవేగంగా దూసుకుపోతున్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ `గోదావరి` ఇప్పుడు కాన్జస్ సిటీలో
ప్రెస్ నోట్: కీలకమైన కేంద్రంలో కొలువుదీరి గోదావరి, దక్షిణాది వంటకాల ప్రియులను గ్రామీణ వాతావరణ నేపథ్యం, అత్యుత్తమ రుచులు మరియు విందు భోజనాలతో అలరించేందుకు సిద్ధం.
గోదావరి, అగ్రరాజ్యం అమెరికాలో శరవేగంగా వృద్ధి సాగిస్తున్న ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ ఇప్పుడు కాన్జస్ సిటీలోకి అడుగిడుతోంది. ప్రత్యేకమైన వంటకాలు, అత్యుత్తమైన ఆహ్లాదకర వాతావరణం, సమ్మోహనపరిచేవిందు భోజనాల వేదికతో భోజనప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. గోదావరి కాన్జస్ సిటీ ఈ వారాంతంలో ప్రారంభం కానుంది. తద్వారా అమెరికాలో మరింత విస్తరించడం, తన ముద్రను మరింత బలోపేతం చేసుకోనుంది.
గోదావరి కాన్జస్ సిటీ (Kansas City, Kansas) తనదైన శైలిలో విశిష్టతను కలిగి ఉంది. 150 సీట్ల కెపాసిటీ మరియు ``పుష్కర`` పేరుతో సువిశాలమైన బాంక్వెట్ హాల్‌ను కలిగి ఉంది. స్ప్రింట్ హెడ్ క్వార్టర్స్ తో పాటు మరెన్నో సంస్థలకు కొన్నిమైళ్ల దూరంలో ఉండి అత్యుత్తమ కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉంది.
“గోదావరి తన నూతన కేంద్రాన్ని కన్జాస్ సిటీలో ప్రారంభించనుందనే వార్తను మేం విన్నపుడు మాకెంతో ఉత్సుకత కలిగింది. అందుకే మేం ఈ సంతోషాన్ని పలువురితో పంచుకున్నాం. ఇప్పటికే గోదావరి ప్రారంభోత్సవం కానుందనేశుభవార్త అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు గోదావరి రుచుల కోసం వేచి చూస్తున్న వారెందరో ఉన్నారు. గోదావరి రుచుల గురించి ఇప్పటివరకు మేం ఎన్నో చక్కని రివ్యూల ద్వారా తెలుసుకున్నాం. ఈ వారాంతంలో అలాంటివాటన్నింటినీ మేం ప్రత్యక్షంగా రుచి చూడబోతున్నాం” అని కాన్జస్ సిటీ వాసి అయిన సాఫ్ట్‌వేర్ నిపుణురాలు సంధ్యారెడ్డి తన అభిప్రాయాలు పంచుకున్నారు.
గోదావరి కాన్జస్ సిటీ తనదైన విశిష్టతను కొనసాగిస్తూ గ్రామీణ వాతావరణ నేపథ్యంతో ఈ నూతన కేంద్రాన్ని తీర్చిదిద్దింది. ఈ వాతావరణం అచ్చూ మీ సొంత గ్రామంలోని అనుభూతిని మీకు గుర్తుకు చేసేంత ఆత్మీయ రీతిలో ఉండటంవిశేషం. గోదావరి కాన్జస్‌సిటీ తన “పల్లెటూరు” బఫెట్‌ను ఈ వారాంతంలో అతిథులకు అందించనుంది. “మిరియాల గోబీ వేపుడు”, “కరివేపాకు మష్రూం వేపుడు”, “గోల్కొండ కోడి వేపుడు”, “మాంసం కఠి రోల్స్”, “పైనాపిల్ రసం”, “మామిడికాయ సాంబార్” వంటి వాటితో పాటుగా గతంలో ఎన్నడూ రుచి చూడని మరెన్నో నోరూరించే రుచులను ఆస్వాదించేందుకు సిద్ధం చేసింది.
“గోదావరి (GODAVARI) వ్యవస్థాపకులను మేం కలిసినప్పుడే...కాన్జస్ సిటీలో మేం గోదావరితో కలిసి నడవాలనే నిర్ణయాన్ని వెనువెంటనే తీసుకున్నాం. గోదావరి బృందానికి ఆహారం, ఆతిథ్యం విషయంలో గొప్ప తపన కలిగి ఉండటంమమ్మల్ని ఆకట్టుకుంది. వాళ్లు పనిచేసిన తీరు, కఠిన శ్రమ, నిరంతరం తోడ్పాటు వల్ల మా కలను స్వల్పకాలంలోనే నెరవేర్చుకునే అవకాశం దొరికింది. గోదావరి కుటుంబంతో కలిసి నడుస్తున్నందుకు మాకు చాలా ఉత్సాహంగా, సంతోషంగాఉంది” అని గోదావరి కాన్జస్ సిటీ యజమానులు అయిన 28 ఏళ్ల యువకులు సుదాంశ్, విశ్వాక్, నిఖిల్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
“ఈ ఏడాదిలో మేం ప్రారంభించిన ప్రతి కొత్త కేంద్రం మా బ్రాండ్‌లో వజ్రపు కలికితురాయి వంటిది. అట్లాంటా, నాష్‌విల్, టెనెసీ, అరిజోనా, ఫీనిక్స్, లాస్ ఏంజెలిస్ తో పాటుగా మరెన్నో దేశాల్లో కేంద్రాలు ప్రారంభించే ప్రతిపాదనలు మా వద్దఉన్నాయి. మరెన్నో వంటకాలు, కొత్త రుచులను వినియోగదారులకు అందించేందుకు, మరిన్ని విశిష్ట సేవల కోసం మేం నిరంతరం మా కఠిన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరంతో పాటు రాబోయే కాలంలో కూడా మరెన్నో గొప్పవిషయాలను మా నుంచి మీరు విననున్నారు, మీరు చూడనున్నారు కూడా” అని బ్రాండ్ గోదావరి తరఫున కౌశిక్ కోగంటి వెల్లడించారు.
లొకేషన్:
గోదావరి కాన్జస్ సిటీ
7328 వెస్ట్ 19వ వీధి,
ఓవర్లాండ్ పార్క్, కాన్జస్ 66213
913-766-8590
సంప్రదించండి
సుదాంశ్ మారోజు
216-533-1129
KANSASCITY@GODAVARIUS.COM
ప్రముఖ తెలుగు సినీ నటుడు బెనర్జీ గోదావరి కొలంబస్ గురించి చెప్పిన అద్భుతమైన అభిప్రాయాన్ని ఈ క్రింది వీడియోలో మీరు వీక్షించవచ్చు:
మరోమారు ప్రత్యేక కృతజ్ఞతలు... మా వంటకాలను మీరంతా ఆస్వాదిస్తున్నారని భావిస్తున్నాం
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC