: పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడట!


జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పై క్రిటిక్ కత్తి మహేశ్ తీవ్ర చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని, మంచి మనసున్న వ్యక్తి అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడట. ఇదే సమయంలో కత్తి మహేశ్ గురించి తారక్ ప్రస్తావించారట. అంతపెద్ద స్టార్ గురించి ఇలాంటి వ్యాఖ్యానాలు కత్తి మహేశ్ చేయకుండా ఉంటే బాగుండేదని తన సన్నిహిత వర్గాల దగ్గర ఆయన అన్నారట.

ఇదిలా ఉండగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైన, ఆయన అభిమానులపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన క్రిటిక్ కత్తి మహేశ్ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈయన చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తనను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం విదితమే. బెంగళూరుకు చెందిన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లలో.. ‘గౌరీ లంకేశ్’ కు బదులు ‘గౌరీ శంకర్’ అనే పేరు రాయడంపైనా కత్తి మహేశ్ విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News