: ఈ సినిమాతో బాహుబలి రికార్డులు బద్దలవుతాయి: రానా ధీమా


టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన రానా... ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటీవల లండన్ లో జరిగిన 'సంకార్య యూకే 2017' కార్యక్రమానికి రానా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశానని చెప్పాడు. 1884లో పోరుబందరు సమీపంలో సముద్రంలో మునిగిపోయిన 'విజిలి' షిప్ కు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని తెలిపాడు. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. 'బాహుబలి' రికార్డులు బద్దలైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అన్నాడు. 

  • Loading...

More Telugu News